
గత కొన్ని రోజులు క్రితం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికా దళాలు వెనక్కు వచ్చేయడంతో అక్కడ తాలిబన్ల కి, ఆఫ్ఘనిస్తాన్ సైనిక బృందాల మధ్య హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చెందిన ఫోటో జర్నలిస్ట్ సిద్దిక్ ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్ లకు మధ్య జరిగిన ఘర్షణలో తాలిబన్ల తూటాల కి బలయ్యారు సిద్దిక్. రాయిటర్స్ మీడియా సంస్థ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సిద్ధికి, అక్కడ వార్తలను కవర్ చేయడానికి కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ బలగాల వెంట ఉన్నారు. కాందహార్ లోని బోల్డ్ క్ ప్రాంతంలో ప్రధాన మార్కెట్ దగ్గర శుక్రవారం నాడు తాలిబన్ల కాల్పులకు ప్రాణాలు కోల్పోయారని భారత్ రాయబారి ఫరీద్ తెలిపారు. ఈ ఘటనతో రాయిటర్స్ సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సిద్ధికి ఆఫ్ఘనిస్తాన్ లో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని రాయిటర్స్ అధ్యక్షుడు మైకేల్ ఫ్రీడెన్ బెర్గ్ , ఎడిటర్-ఇన్-చీఫ్ అలె శాండ్రా పేర్కొన్నారు.
Comments are closed.