The South9
The news is by your side.

పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా.. అభిమానులకు సర్ ప్రైజ్ లు!

post top
  • సెప్టెంబర్ రెండున పవన్ కల్యాణ్ జన్మదినం
  • ‘వకీల్ సాబ్’ నుంచి విశేషం ఉందన్న దిల్ రాజు
  • హరీశ్ శంకర్ సినిమా నుంచి కూడా సర్ ప్రైజ్

పవన్ కల్యాణ్ అభిమానులకు రేపు.. అంటే సెప్టెంబర్ 2 పండుగ రోజు లాంటిది. ఎందుకంటే, రేపు తమ అభిమాన కథానాయకుడి పుట్టినరోజు. పైగా కొంత కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ పలు సినిమాలలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాలను ప్రకటించారు కూడా.

after image

ఈ నేపథ్యంలో వస్తున్న బర్త్ డే కాబట్టి, దీనికి ఓ ప్రత్యేకత వుందని చెప్పుకోవచ్చు. అందుకే పవన్ తో సినిమాలు నిర్మిస్తున్న దర్శక నిర్మాతలు కూడా కొత్త అనౌన్స్ మెంట్లతో రేపు అభిమానులను ఆనందింపజేయడానికి సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో, పవన్ నిర్మాతల నుంచి రేపు రెండు సర్ ప్రైజ్ లు రానున్నాయి.

గతంలో తనతో ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన హరీశ్ శంకర్ తో పవన్ ఇప్పుడు ఓ సినిమా చేయనున్న సంగతి విదితమే. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘పీఎస్ పీకే 28’ గురించి అప్ డేట్ ఉంటుందని ఇటీవలే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. బహుశా ఈ చిత్రం టైటిల్ని రేపు ప్రకటించవచ్చు.

అలాగే, తమ నుంచి కూడా రేపు ఓ కొత్త కబురు ఉంటుందని దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ప్రకటించింది. ఈ సంస్థ ప్రస్తుతం పవన్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి రేపు ఈ రెండు చిత్ర నిర్మాణ సంస్థలూ ఏ విశేషాలను పవన్ అభిమానులకు అందించనున్నాయో చూడాలి!.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.