
పలు అంశాలపై మంత్రుల విజ్క్షప్తి.. సానుకూలంగా స్పందించిన సీఎం వైయస్ జగన్

హైదరాబాద్‌కు బస్సులు నడిపేందుకు సీఎం వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణకు బస్సు సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు బస్సుల రవాణా అంశాన్ని సీఎం వైయస్ జగన్ దృష్టికి మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన సీఎం వైయస్ జగన్..బస్సులు తిప్పేందుకు న్యాయ సలహా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలువురు మంత్రులు వివిధ అంశాలను సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై సీఎం వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు..
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు అంశాన్ని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
అన్ని శాఖల్లోని విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు చెల్లించాలని సీఎం ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో అటవీ అనుమతులు, ఉపాధి పనులు చేపట్టాలని పుష్పశ్రీవాణి సీఎంను కోరారు. ఇందుకు స్పందించిన సీఎం ..రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అటవీ అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటైజర్లు తాగి మరణిస్తున్న అంశాన్ని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి విశ్వరూప్ సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న మద్యం ధరలపై సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు. శానిటైజర్లు తాగి చనిపోకుండా చూడాలని సూచించారు. రోడ్ల నిర్మాణంపై సీఎం వైయస్ జగన్‌కు పలువురు మంత్రులు వినతిపత్రం అందజేశారు.రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
Comments are closed.