
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ని ప్రైవేటీకరణ చేస్తుందన్న నిర్ణయంపై సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్ కుమార్(కే ఏ పాల్) హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్న టువంటి నిర్ణయాన్ని కి మద్దతుగా…కేంద్ర మంత్రివర్గం నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరింత బలోపేతం చేసే విధంగా దార్శనిక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కే ఏ పాల్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం కే ఏ పాల్ అమెరికాలో ఉన్నందున, ఆయన తరఫున జీపి ఏ హోల్డర్ జ్యోతి బేగల్ ఈ పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఉక్కు శాఖ కార్యదర్శి, గనుల శాఖ కార్యదర్శి , రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లను పేర్కొన్నారు.
Comments are closed.