The South9
The news is by your side.

ప్రతీ మగాడితో లింక్‌ పెట్టేస్తారు.. ట్రోల్స్‌పై స్పందించిన సురేఖ వాణి

post top

తనపై వస్తున్న నెగెటివ్‌ కామెంట్స్‌పై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది సురేఖ వాణి. ఇలాంటి ఆకతాయిలు చేసే కామెంట్స్ తీవ్ర మనోవేదన కలిగిస్తాయని తన బాధను వ్యక్తం చేసింది. భర్త చనిపోయిన వెంటనే షూటింగ్‌లకు హాజరయ్యానని నా మీద ఆరోపణలు చేశారు. కానీ నా సమస్యలు వారికి అర్ధం కావు. టాలీవుడ్ సోపోర్టింగ్ రోల్స్‌లో పేరు తెచ్చుకున్న నటీమణులు ఇటీవల సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు. ఈ లిస్ట్‌ లో ముందుగా చెప్పుకోవాల్సిన తారలు ప్రగతి, సురేఖ వాణి. చేసేవి ఆంటీ పాత్రలే అయినా సోషల్ మీడియాలో మాత్రం కుర్ర హీరోయిన్‌లకు పోటి ఇచ్చే రేంజ్‌లో గ్లామరస్‌గా కనిపిస్తుంటారు. అయితే వీరి సోషల్ మీడియా పోస్ట్‌లపై అదే స్థాయిలో ట్రోల్స్‌ కూడా వినిపిస్తుంటాయి. ముఖ్యం గా సురేఖ వాణి తన కూతురితో కలిసి చేసే పోస్ట్ విషయంలో దారుణమైన ట్రోల్స్‌ వస్తుంటాయి.

గతంలో సురేఖ భర్త చనిపోయిన సందర్భంలో కూడా ఓ వర్గం ఆమెను టార్గెట్‌ చేస్తూ అభ్యంతరకర భాషలో ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా భర్త చనిపోయిన వెంటనే షూటింగ్‌లకు హాజరైందంటూ ఆమె మీద విమర్శలు చేశారు. అయితే అప్పట్లో ఈ ట్రోలింగ్స్‌పై సీరియస్‌ అయిన సురేఖ తరువాత అలాంటి కామెంట్స్‌ను పట్టించుకోవటం మానేసింది. ఇటీవల తన కూతురితో కలిసి వేకేషన్‌కు వెళ్లటం, టిక్‌ టాక్‌లు చేయటం లాంటివి చేస్తూ ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ సీనియర్‌. ఈ వీడియోలపై కూడా ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా సురేఖ వేసుకునే డ్రెస్‌ల విషయంలో చాలా ఇబ్బందికరంగా కామెంట్లు చేస్తున్నారు ఆకతాయిలు.

after image

surekha vaani

అయితే ఈ కామెంట్స్‌పై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది సురేఖ వాణి. ఇలాంటి ఆకతాయిలు చేసే కామెంట్స్ తీవ్ర మనోవేదన కలిగిస్తాయని తన బాధను వ్యక్తం చేసింది. భర్త చనిపోయిన వెంటనే షూటింగ్‌లకు హాజరయ్యానని నా మీద ఆరోపణలు చేశారు. కానీ నా సమస్యలు వారికి అర్ధం కావు. నా భర్త ఉన్నన్ని రోజులు నాకు సమస్యలు లేవు, కాని ఇప్పుడు నా కూతుర్ని నేనే పోషించాలి. అందుకోసం నటించాలి. నాకు బాధ్యతల గురించి వారికి తెలియదు కానీ కామెంట్లు మాత్రం చేస్తారు ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు బయట ఏ మగాడితో కలిసి కనిపించినా లింక్‌ పెట్టేస్తారనీ, అతడితో నా బంధుత్వం ఏంటో కూడా పట్టించుకోకుండా సురేఖ పెళ్లి చేసుకుందా అని వార్తలు రాస్తారు. అంటూ కామెంట్ చేసింది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.