కృష్ణా: ఆంధ్రప్రదేశ్ లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడిన ఘటన జిల్లాలోని విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల వద్ద చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రాకు 720 మద్యం బాటిళ్లను ఇండికా కారులో తరలిస్తూ ఉండగా.. మండలంలోని చండ్రుపట్ల వద్ద తనిఖీల్లో పట్టుడ్డాయి.

ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోగా మరోకరు పరారిలో ఉన్నాడని తెలిపారు. ఏపీ ప్రభుత్వం మద్యం నివారణలో భాగంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తోందని సీఐ తెలిపారు. అక్రమంగా మద్యం తరలించిన వారిని, వారికి సహకరించిన సూత్రధారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments are closed.