
హైదరాబాద్: తెలంగాణ లో ఇవాళ 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 17,357 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 881 కేసులు వచ్చాయి. మిగతా కేసులు జిల్లాల్లో నమోదు అయినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 17,357 పాజిటివ్ కేసులు ఉండగా, 8082 మంది డిశ్చార్జీ అయ్యారు. 9008 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ కరోనాతో ఏడుగురు మృతి చెందగా ఇప్పటి వరకు 267 మంది మరణించారు. మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కేసుల ఉధృతి తగ్గడం లేదు.
Comments are closed.