
అనంతపురం : మూడు రోజులు ఉత్కంఠ తరువాత అనంతపూర్ జిల్లా
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. టీడీపీకి చెందిన 18 మంది కౌన్సిలర్ల మద్దతుతో పాటు , సిపిఐ స్వతంత్ర అభ్యర్థి బలపరచడం తో జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా ఎన్నిక కావడానికి మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో జెసి ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను మున్సిపల్ చైర్మన్ అవ్వడానికి జగన్ చాలా సహాయపడ్డాడు అని, జగన్ కాని తలుచుకుంటే , ఇప్పుడున్న పరిస్థితుల్లో చైర్మన్ అయ్యే అవకాశాలు లేవని అన్నారు, తాడిపత్రి అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కలుస్తానని తెలిపారు. తాడిపత్రిలో రౌడీయిజం, గూండాఇజం ,ఇక ఉండబోదని అన్నారు. సేవ్ తాడిపత్రి మా నినాదం అని తెలిపారు . గతంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని పరుష పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డి నేడు ఇలా మాట్లాడడం చూస్తుంటే రాజకీయాల్లో ఏ రోజు ఏదైనా జరుగుతుంది అనేదానికి ఇదే నిదర్శనం. ఏది ఏమైనా వ్యక్తిగత దూషణలకు రాజకీయ నాయకులు దూరంగా ఉండటం మంచిది.
Comments are closed.