హైదరాబాద్: టాలీవుడ్ హీరో నితిన్ రెడ్డి ఈ నెల 26న పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్ నుమా ఫ్యాలెస్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కుటుంబ సభ్యులు, సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఈ వివాహ వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. నాగర్ కర్నూలు కు చెందిన డాక్టర్ దంపతుల కుమార్తె శాలిని కందుకూరి ని నితిన్ రెడ్డి వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. నితిన్ వయస్సు 36 ఏళ్లు కాగా శాలిని వయస్సు 30 సంవత్సరాలు.
ఫిబ్రవరి 15న హైదరాబాద్ లోని నితిన్ ఇంట్లో రెండు కుటుంబాలు పసుపు కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 26వ తేదీన దుబాయ్ లో పెళ్లి చేసుకోవాలని ముహూర్తం పెట్టుకున్నారు. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం విదితమే. శాలిని తల్లిదండ్రులు ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి వలస వచ్చి నాగర్ కర్నూలులో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు ఇద్దరూ రెండు దశాబ్ధాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతూ, ప్రగతి నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నారు. డాక్టర్ నూర్జహాన్, డాక్టర్ సంపత్ కుమార్ కందుకూరి ల రెండో కుమార్తె శాలిని.
Comments are closed.