
చెన్నై ప్రతినిధి :రాజకీయ సంక్షోభంలో ఉన్న పుదుచ్చేరి ప్రభుత్వ వ్యవహారం రాష్ట్రపతి పాలన వైపు వెళ్లే విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని ఇంచార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏ ర్పాటు చేయడానికి ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి ముందుకి రానందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిజెపి ప్రధాన ప్రతిపక్ష నేత రంగస్వామి విముఖత చూపించడం వలన రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. 14 మంది సభ్యులు బలం ఉన్న ప్రతిపక్షం అవకాశం ఉన్నప్పటికీ ఎందుకనో ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇంచార్జ్ గవర్నర్ తమిళసై రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. కేంద్రం నుంచి ఉత్తర్వులు రాగానే పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమలులోకి రానుంది
Comments are closed.