
జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో బలగం జగదీష్ నిర్మిస్తున్న సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రం ది కానిస్టేబుల్. దర్శకుడు ఆర్యన్ చెప్పిన కథ, కథనం తనని ఆకట్టుకున్నాయనీ, ఈ తరహా చిత్రం తను మునుపెన్నడూ చేయనందున ఒక ఎమోషనల్ కానిస్టేబుల్ పాత్రలో నటించే అవకాశం ఆనందం వ్యక్తం చేశారు వరుణ్ సందేశ్.

ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి కెమెరా : హజరత్ షేక్ (వలి), సంగీతం : సుభాష్ ఆనంద్, మాటలు : శ్రీనివాస్ తేజ, పాటలు : రామారావు, శ్రీనివాస్ తేజ.
డువ్వాసి మోహన్, సూర్య, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఆర్యన్ సుభాన్ SK, నిర్మాత : బలగం జగదీష్, PRO: వినాయక రావు.
Comments are closed.