జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నీటి ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షంతో వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటోంది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 9.516 టీఎంసీలకు గానూ 5.638 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు వరద చేరుతోంది.
గతేడాది జూలైతో పోలిస్తే ఈసారి నీటి నిల్వ గరిష్ఠంగా ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 2019లో ఇదే సమయానికి 1.75 టీఎంసీల నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 5.638టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.30 మీటర్లుగా ఉంది. 9.516 టీఎంసీలకు గానూ 5.638 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రానున్న రోజుల్లో వర్షాలు భారీగా పడే అవకాశం ఉండడంతో ఈ సారి ప్రాజెక్టు త్వరలోనే పూర్తిస్థాయిలో నిండుతుందని ప్రాజెక్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Comments are closed.