The South9
The news is by your side.
after image

హైలెవల్ కెనాల్ పూర్తి చేసేదే మేమే…. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.

post top

*హైలెవల్ కెనాల్ పూర్తి చేసేదే మేమే…. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: పదేళ్లు ఉండి మీరేం ఏం చేశారో ప్రజలందరికి తెలుసు*

*: హైలెవల్ కెనాల్ ఆలోచన మా తండ్రి రాజమోహన్ రెడ్డిదే*

*: సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి*

*: మర్రిపాడులో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం*

 

మెట్ట నియోజకవర్గాలకు సాగు, తాగునీటిని అందించే హైలెవల్ కెనాల్ పూర్తి చేసేది మేమేనని, ప్రజలందరికి జగనన్న మాటగా చెబుతున్నాననని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.

 

బుధవారం మర్రిపాడు మండలం పెగళ్లపాడు, ఇర్లపాడు, నన్నువారిపల్లి, అల్లంపాడు పంచాయతీలలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులు ఇస్తూ ఎమ్మెల్యే మేకపాటికి ఆయా గ్రామాలలో ప్రచార కార్యక్రమాలకు ఘన స్వాగతం పలికారు.

 

Post midle

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో 10 సంవత్సరాల పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన ఆనం రామనారాయణరెడ్డి గతంలో ఎందుకు హైలెవల్ కెనాల్ పనులను పూర్తి చేయలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు.

 

Post Inner vinod found

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మా తండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మెట్ట నియోజకవర్గాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగిందని, దీని ద్వారా ఉదయగరి నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని తెలిపారని అన్నారు.

మెనిఫెస్టోలో సైతం పెట్టించారని, సోమశిల ద్వారా మర్రిపాడుకు సాగునీటిని అందించాలని సూచించడంతో హైలెవల్ ఆలోచన చేశారని, నాలుగు నెలల వ్యవధిలోనే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారని, అనంతరం ఆయన మరణించడంతో పనులు నిలిచిపోయాయని, మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పనులు వేగం పుంజుకోవడంతో మా సోదరుడు దివంగత మంత్రి రెండవ విడత పనులను కూడా ప్రారంభించారని అన్నారు.

 

హైలెవల్ కెనాల్ పనుల్లో వేగం తగ్గడానికి కారణం అప్పట్లో నరిగా భూ సేకరణ పనులు జరగక, నష్టపరిహారం అందించక ఇలాంటివి జరిగాయన్నారు. తాను శాసనసభ్యునిగా గెలుపొందిన ఆనంతరం ఆరు నెలల వ్యవధిలోనే భూసేకరణకు సంబంధించిన పనులను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఓ కొలిక్కి తీసుకొచ్చామని, త్వరలోనే భూసేకరణకు సంబంధించి రైతులు కోరిన విధంగా నష్టపరిహారం చెల్లించి పనులు చేపట్టే విధంగా చూస్తామని అన్నారు.

 

హైలెవల్ కెనాల్ పనులు పూర్తి చేయడంతో వారి మన ప్రాంతం నస్యక్యామలవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆవినీతికి తావులేకుండా రూ.3.50 లక్షల కోట్లు ప్రతి కుటుంబానికి చేరాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందచేస్తున్న వాలంటీర్లపై ఆరోపణలు చేసి ఎన్నికల సమయంలో వారి సేవలను సైతం అడ్డుకున్నారని, ఇలాంటివన్ని చూస్తే చంద్రబాబునాయుడు మదిలో మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారన్నారు. ప్రజలు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఓట్లు వేయాలని, జగనన్న ఇచ్చిన మాట తప్పరనే నమ్మకం ప్రజలందరికి ఉందని పేర్కొన్నారు.

 

గతంలో చంద్రబాబునాయుడు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఇంటింటి మహాలక్ష్మి లాంటి 600 పథకాలతో ప్రజల ముందుకు వచ్చి ఏ ఒక్క హామిని నెరవేర్చలేదని, మళ్లీ మెనిఫెస్టోతో ముందుకు వస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మంచి జరిగిందని, మంచి జరిగి ఉంటే మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు.

 

వైఎస్సార్సీపీ మెనిఫెస్టోను ప్రజలందరూ విశ్వసిస్తున్నారని, ప్రతిపక్ష టీడీపీ మెనిఫెస్టోను కూటమి పార్టీలే నమ్మడం లేదని, ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Post midle

Comments are closed.