
*గౌతమన్న ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో గౌతమన్న చేయాలనుకున్న ప్రతి అభివృద్దిని చేసి ఈ ప్రాంతాలను అభివృద్ది చేస్తామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెంది రెండో ఏడాది కావడంతో ఉదయగిరిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంగణంలో గౌతమ్ రెడ్డిని స్మరించుకుంటూ స్మృతి చిహ్నాన్ని నిర్మించే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వీరి సోదరుడు ఉదయగిరి ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి, ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మేకపాటి విక్రం రెడ్డి మాట్లాడుతూ తమ సోదరుడు దివంగత మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి తాను మంత్రిగా ఉన్న సమయంలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజ్ ను ప్రభుత్వానికి అందజేసి ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ నేలకొల్పేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు.
అంతలోనే అకాల మరణం చెందడంతో తమ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి యూనివర్సిటీ గురించి తెలపడం ముఖ్యమంత్రి వెంటనే అంగీకరించడంతో ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్థాపించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయన్నారు.
ఈ ప్రాంతాన్ని మేకపాటి గౌతమ్ రెడ్డి ఎప్పుడు గుర్తుండేలా వారి గుర్తుగా ఇక్కడ వారి విగ్రహంతో పాటు ఒక మెమోరియల్, ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేందుకు దానితోపాటు ఇక్కడ వారు ఎప్పుడూ యోగా ఉండే ఆసక్తితో మెడిటేషన్ యోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని విక్రమ్ రెడ్డి తెలిపారు. ఈ కేంద్రంలో ఇక్కడి విద్యార్థులు సిబ్బందితోపాటు ఉదయగిరి వాసులు కూడా వాకింగ్ మరియు యోగాసనాలు చేస్తూ వారి ఆరోగ్య పరమైన చక్కని వాతావరణం కల్పిస్తామని తెలిపారు.

అలాగే గౌతమ్ రెడ్డి ఆశయాలు కనుగుణంగా ఉదయగిరి నియోజకవర్గ మెట్ట ప్రాంతాలకు సాగునీరు మరియు తాగునీరు అవసరాలకు రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన అది నిర్మాణ దశలో ఉండడంతో వాటిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తానని వారి ఆశయాలు ఘనంగా ఆత్మకురు ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
Comments are closed.