*రానున్న మన ప్రభుత్వంలో మరింతగా సంక్షేమాభివృద్దిని అందిస్తాం : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: జగనన్న ప్రభుత్వంలో మెరుగుపడిన పేదల ఆర్థిక పరిస్థితి*
*: దువ్వూరులో సంక్షేమాభివృద్దికి రూ.14 కోట్లు అందచేశాం*
*: రానున్న రోజుల్లో ప్రజలు తెలిపిన ప్రతి అభివృద్దిని పూర్తి చేస్తాం*
*: ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం*
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్దికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఐదేళ్లు పాలన సాగించారని, రానున్న ఎన్నికల్లో తమను మళ్లీ ఆశీర్వదిస్తే మరింత సంక్షేమం, అభివృద్దిని ప్రజలకు అందచేసేలా పాలన సాగిస్తారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
బుధవారం సంగం మండలం దువ్వూరు పంచాయతీలో ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటిని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించి పలుకగా మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలతో మాట్లాడుతూ విజయీభవయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో పేదల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ది, సం6మ కార్యక్రమాలను నిర్వహించామని, ప్రతి కుటుంబానికి మేలు చేసి చూపించామన్నారు.
మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా అని ఆలోచన చేసి, సంక్షేమం జరిగి ఉంటేనే మాకు ఓటేయ్యాలంటూ కోరుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి అని, 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం సీయం జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు.
ఒక్క దువ్వూరు పంచాయతీలో గడిచిన ఐదేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీల ద్వారా 3037 మంది లబ్దిదారులకు రూ.14.06 కోట్లు అందచేయడం జరిగిందని వివరించారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా 17 పనులకు గాను రూ.40లక్షలు అందచేయడం జరిగిందని అన్నారు. జగన్న లే అవుట్ ద్వారా 20 మంది లబ్దిదారులకు, స్వంత స్థలం కలిగిన 24 మందికి ఆర్థిక సహాయం అందచేడం జరిగిందని అన్నారు.
గ్రామస్తులు కోరిన మేరకు రానున్న రోజుల్లో రూ.5లక్షలతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అదే విధంగా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, మిగిలి ఉన్న సిమెంటు, గ్రావెల్ రోడ్లు ఏర్పాటు చేయిస్తామని అన్నారు. చెలిక కాలువ రివిట్ మెంట్ నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు, నాయకులు మా దృష్టికి తీసుకొచ్చారని, దాని నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామి ఇస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి అమలు చేసిన సంక్షేమాల్లో ప్రజలందరికి ఎప్పటికీ గుర్తుండిపోయేవి విద్యా, వైద్యం, వ్వయసాయంలలో తెచ్చిన అనేక సంస్కరణలేనని, నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్దితో పాటు ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చారని, ప్రపంచంతో మన విద్యార్థులు పోటి పడేలా తీర్చిదిద్దడానికి తపన పడుతున్నారన్నారు.
గత ప్రభుత్వం 2014లో డ్వాక్రా, రైతు రుణమాఫీతో పాటు 600 హామిలిచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిలో ఏ ఒక్క హామిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, మళ్లీ చేసేందుకు కూటమిగా వస్తున్నారని, వారిని నమ్మవద్దని ప్రజలకు చించారు. ఈ గ్రామంలో జరిగిన అభివృద్దిని మీకు వివరించే మేము ఓటు అడిగేందుకు ధైర్యంగా వస్తున్నామని పేర్కొన్నారు.
గత టీడీపీ పాలనకు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకు తేడాలను ప్రజలు గమనించాలని సూచించారు. టీడీపీ, పచ్చమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని, ఆ పార్టీ నాయకుల బూటకపు హామిలను నమ్మవద్దని ప్రజలకు తెలిపారు. సంక్షేమం, అభివృద్ది కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు
Comments are closed.