
తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన కి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యకర్తలు సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూకొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే కేంద్ర నాయకత్వం ఇక్కడ కి వచ్చి పర్యటించాలని, దుబ్బాక ఎన్నిక నిర్వహించిన తీరు లో ఇక్కడ ఎన్నిక ని చూడాలని అన్నారు.అలానే కేంద్ర నాయకత్వం లాగా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం లేదని అన్నారు. ఒక వేళ జనసేన అభ్యర్థి ని పోటీ కి నిలపమన్న సంతోషం గా నిలుపుతామని, తిరుపతి లోకసభ పరిధిలో గల 7 నియోజకవర్గ పరిధిలో పవన్ కళ్యాణ్ పర్యటించి గెలుపు కి కృషి చేస్తామని అన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్ఠానానికి కొన్ని షరతులు విధించి డం తో పవన్ కళ్యాణ్ కి ఇక్కడ పోటీ చేయాలని బలంగా ఉన్నట్లు ఉందిని, గతం లో ఇక్కడ నుంచి చిరంజీవి పోటీ చేసి గెలుపొందడం పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం చెందిన ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణం అవచ్చు అనేది విశ్లేషకులు వాదన. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అయిన వైస్సార్సీపీ ఇంకా అధికారికంగా అభ్యర్థి ని ప్రకటించలేదు. తెలుగుదేశం పార్టీమాత్రం మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరు ని ఖరారు చేసేరు,అలానే ఎన్. డి. ఏ. పక్షం లో ఉన్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) (R.P.I)అభ్యర్థి గా జర్నలిస్ట్ మనపాటి చక్రవర్తి పేరుని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దాంట్లో ఏమి చెప్తారు అనేది ఆసక్తి గా మారింది
Comments are closed.