The South9
The news is by your side.
after image

చిరంజీవి రాకతో పవన్ కళ్యాణ్ భల పడతాడా?

post top

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లో విభిన్న పరిస్థితి నెలకొంది. గతంలో మిత్రులు గా ఉన్న వారు ఇప్పుడు శత్రువులుగా ఉన్నారు.2014 లో తెలుగుదేశం ,జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేసి విజయం సాధించాయి. ఆతర్వాత జరిగిన2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ వేరు వేరు గా , జనసేన వామపక్షాలు, తో పొత్తు పెట్టుకొన్నా . వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకొన లేక పోయాయి. ఈ నేపథ్యంలో నిన్న ఒక సమావేశంలో జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ మీడియా తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో చిరంజీవి జత కట్టనున్నాడు అని అన్నారు . అసలు ఇప్పుడు చిరంజీవి బలమెంత అన్నది ముందు గా చర్చించు కోవలసిన అవసరం.
2009 లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 18 సీట్లు ని గెలిపించు కున్నాడు చిరంజీవి. తర్వాత కొంత కాలానికి పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి గా పదవి ని చేజిక్కించుకున్నాడు. తర్వాత కాలం లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి టీడీపీ కి, బీజేపీ, కి మద్దతు పలకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బలం అతని అభిమానులు అని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు కొన్ని నచ్చకపోయన ఆయన తో ప్రయాణం చేసే లక్షలాది అభిమానులు పవన్ కళ్యాణ్ కి ఉండడం అనేది గొప్ప విషయం అని చెప్పక తప్పదు… ఈ పరిస్థితి లో చిరంజీవి అభిమానులు పవన్ ని అభిమానించే జాబితాలో ఉన్నవారే.                                                                                                                              ఈ పరిస్థితి లో     చిరంజీవి పవన్ తో రావడం ఆయనకు ఎంత బలం అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేయడం చాలా మందికి నచ్చలేదు .అలానే చాలా మంది విభిన్న వర్గాల కి చెందిన వ్యక్తులు మార్పు కోసం అని చిరంజీవి తో ప్రయాణం చేసేరు. ఎప్పుడైతే చిరంజీవి కాంగ్రెస్ తో వెళ్ళేడో ఆయన అభిమానులు దాని ని జీర్ణించుకో లేక పోయినారు. ఈ పరిస్థితుల్లో… పవన్ కళ్యాణ్ తో చిరంజీవి కలిసిన పెద్ద ప్రయోజనం లేదనేది విశ్లేషకులు వాదన.                                             విష్ణు ..హైదరాబాద్

Post midle

Comments are closed.