
- 48 గంటల ఉచిత వైద్య పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్
- తమిళనాడు రాష్ట్ర ప్రజలకే కాకుండా మిగతా వారికి కూడా వర్తించే విధంగా అమలు
- తన నిర్ణయాలతో ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న స్టాలిన్ తమిళనాడు లో స్టాలిన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తమిళనాడు ప్రజలతో పాటు మిగతా రాష్ట్ర నాయకులు ప్రజలు చర్చించుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. సామాన్యుడిలా బస్సులో ప్రయాణం చేస్తూ ప్రజల అవసరాలు తెలుసుకోవడం దగ్గరనుంచి, ఎమ్మెల్యేలను అసెంబ్లీలో తనును పొగడకుండా ఉండాలని సూచించడం, వానలు వరదలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరకు వెళ్లి వారికి భరోసా కల్పించడం ఇలా ప్రతి విషయంలోనూ సామాన్య ప్రజలకు దగ్గరవుతున్న స్టాలిన్ మరొక గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారు. తమ రాష్ట్ర ప్రజలే కే కాకుండా, మిగతా వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించడానికి, నమ్మై కాక్కుం 48 48గంటల ప్రాణాలు కాపాడడం అనే అర్థం వచ్చే విధంగా గా ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి స్టాలిన్. ప్రమాదంలో ఎవరైనా గాయపడిన తక్షణం వైద్యం అందించే దిశగా ఈ పథకం వర్తిస్తుంది. గాయపడిన వారు ఎవరైనా సరే 48 గంటల పాటు ఉచిత చికిత్స అందించే విధంగా నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. ఎలాంటి ఖర్చు లేకుండా 48 గంటలు ఉచిత వైద్యం అందిస్తుంది. గాయపడిన వారికి ప్రథమ చికిత్స చాలా అవసరం కాబట్టి4 8 గంటల వైద్యం అందించే సేవలు గొప్పగా ఉపయోగపడతాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.



Comments are closed.