The South9
The news is by your side.

రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోద‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

post top

 

అమ‌రావ‌తి

*‌రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోద‌రుల‌కు సీఎం  వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు*

after image

ముస్లింల‌కు ఎంతో పవిత్ర‌మైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింల‌కు ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు.

నెల రోజుల‌పాటు నియ‌మ నిష్ట‌ల‌తో క‌ఠిన ఉప‌వాస వ్ర‌తం ఆచ‌రించే ఈ పుణ్య‌ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది అని అన్నారు.

మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్ర‌వ‌క్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భ‌వించిన‌ది రంజాన్ మాసంలోనే కావ‌డంతో ముస్లింలు ఈ నెల‌కు అత్యంత ప్రాముఖ్య‌త‌‌నిస్తార‌న్నారు.

ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తూ.. మ‌నిషిలోని చెడు భావాల్ని, అధ‌ర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్ ఉపవాస దీక్ష అని ఆయ‌న అన్నారు.

 

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.