
తేదీ: 29.10.2025
నెల్లూరు:
రాచర్ల పాడు వద్ద ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు జిల్లా పోలీసు కృషినెల్లూరు జిల్లా హైవే మీదకు నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం కలగకుండా పనిచేసిన పోలీసులను జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల అభినందించారు. తుఫాన్ ప్రభావంతో రాచర్ల పాడు గ్రామం వద్ద NH–16 రహదారిపై ఉన్న IFFCO ఫ్యాక్టరీ చెరువులోని నీరు హైవే మీదకు రావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందిన వెంటనే, జిల్లా యస్.పి. ఆదేశాల మేరకు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) CH. సౌజన్య, రూరల్ DSP జి. శ్రీనివాసరావు, కొడవలూరు CI సురేంద్రబాబు, SI కోటిరెడ్డి మరియు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, హైవే మీద వాహనాలకు ఇబ్బంది లేకుండా వన్‌వే సిస్టమ్ అమలు చేసి, ట్రాఫిక్‌ను సురక్షితంగా మళ్లించారు.రాత్రంతా అప్రమత్తంగా వ్యవహరించిన బృందం రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు నిరంతర గస్తీ తీస్తూ, వాహనదారులు ఇబ్బంది పడకుండా కావలి వైపు ప్రయాణించేలా చర్యలు తీసుకుంది. నీటి మట్టాన్ని పరిశీలిస్తూ, రెండు వైపులా వచ్చెడి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షితంగా పంపింది.ప్రతికూల వాతావరణంలోనూ విధి నిర్వహణలో నిబద్ధత, ధైర్యం ప్రదర్శించిన పోలీసులు ప్రశంసార్హులు అని జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల అన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే పోలీసు శాఖ లక్ష్యమని పేర్కొంది. రాత్రిపూట విశ్రాంతి లేకుండా సేవ చేసిన అధికారులను జిల్లా యస్.పి. అభినందించారు.

జిల్లా పోలీసు కార్యాలయం, SPS నెల్లూరు —

తేదీ: 29.10.2025



Comments are closed.