
తేదీ: 14-05-2025,
అమరావతి.
*ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి అనిత*
*విజిబుల్‌తో పాటు ఇన్విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత*
*పీఎస్ కోసం స్థలాన్ని ఇచ్చిన సజ్జా వెంకటేశ్వరరావుకు కృతజ్ఞతలు*
*సీఎం సామాజిక బాధ్యతకు నిదర్శనమే జన్మభూమి, శ్రమదానం, పీ4*
*ఏపీకీ పోలీస్ అకాడమీ లేదు..త్వరలోనే అప్పా ఏర్పాటు చేస్తాం*


*గండిగుంట పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో హోంమంత్రి అనిత*
అమరావతి,మే,14; కృష్ణా జిల్లా ఉయ్యూరు రూరల్ కొత్త పోలీస్ స్టేషన్ భవానాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. గత టీడీపీ హాయంలో 80శాతం పూర్తయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేసి ప్రారంభిస్తోందని హోంమంత్రి వెల్లడించారు. రహదారి విస్తరణ కారణంగా భవనాలను అప్పట్లో తొలగించారు. ఎంతో సహృదయంతో గండిగుంట గ్రామానికి చెందిన సామాజిక వేత్త సజ్జా వెంకటేశ్వరరావు ప్రభుత్వ కార్యాలయాలకు గండిగుంట శివారు కాకానీనగర్కు సమీపంలో 1 ఎకరం 85 సెంట్లు స్థలాన్ని ఇచ్చి దాతృత్వం చాటుకోవడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రూ.25లక్షలతో ఉయ్యూరు రూరల్ పోలీస్‌స్టేషన్ భవనాన్ని నిర్మించినట్లు స్పష్టం చేశారు. ఆధునిక హంగులతో భవనాన్ని నిర్మించేందుకు..కృషి చేసిన అందరినీ హోంమంత్రి అభినందించారు.
*ఏపీకీ పోలీస్ అకాడమీ లేదు..త్వరలోనే అప్పా ఏర్పాటు చేస్తాం : హోంమంత్రి అనిత*
శ్రమదానం, జన్మభూమి , పీ4 కార్యక్రమాలు సీఎం చంద్రబాబునాయుడులోని సామాజిక బాధ్యతకు నిదర్శనమని హోంమంత్రి అనిత అన్నారు. ఉన్నఊరు, కన్నతల్లిని మరవొద్దన్నదే ఆయన సిద్ధాంతమన్నారు. విజిబుల్‌తో పాటు ఇన్విజిబుల్ పోలీసింగ్‌కు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఏపీలోనే కృష్ణా జిల్లాలో అత్యధిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. డ్రోన్లు సహా టెక్నాలజీ ద్వారా నేరాలను నియంత్రిస్తామన్నారు. డ్రోన్ ఎగిరితే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా పోలీస్ నిఘా వ్యవస్థ పటిష్టం చేసినట్లు స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో ఓ పోలీస్ మనస్తత్వం కలిగిన వారు ఉండాలి..అప్పుడే నేరరహిత సమాజం సాధ్యమని హోంమంత్రి పేర్కొన్నారు. లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించడమే కాకుడా ఎక్సైజ్ శాఖలో కీలక సంస్కరణలు చేపడుతోన్న మంత్రి కొల్లురవీంద్రకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎస్పీ ఆర్.గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
————–
Comments are closed.