The South9
The news is by your side.

వై.వీ అంకితభావానికి అది నిదర్శనం: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

post top

తిరుపతి ప్రతినిధి :

తిరుపతి, చిత్తూరు జిల్లా.

టీటీడీ ఛైర్మన్ గా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన వై.వీ సుబ్బారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

after image

రెండో సారి టీటీడీ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన జాబితాలో వై.వీ సుబ్బారెడ్డిది నాలుగో స్థానం

వై.వీ అంకితభావానికి అది నిదర్శనం: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ వై.వీ సుబ్బారెడ్డితో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం తిరుపతిలోని టీటీడీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కార్యాలయంలో వై.వీ సుబ్బారెడ్డితో ఆయన సమావేశమయ్యారు. రెండోసారి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పూలగుచ్ఛం అందజేసి మంత్రి గౌతమ్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. రెండు సార్లు టీటీడీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన జాబితాలో వై.వీ సుబ్బారెడ్డి నాలుగో స్థానంలో ఉండడం ఆయన అంకితభావానికి నిదర్శనమని మంత్రి గౌతమ్ రెడ్డి కొనియాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కూడా హాజరై టీటీడీ ఛైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.