The South9
The news is by your side.

కోర్టులో సమంతకి ఊరట!

post top

హైదరాబాద్‌: ప్రముఖ నటి సమంతకి కూకట్‌పల్లి కోర్టులో ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేయకూడదని, ఇప్పటికే పలు యూట్యూబ్‌ ఛానల్స్‌లో ఆమెకి సంబంధించిన వీడియోలు తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఆమె కూడా వ్యక్తిగత వివరాల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకూడదని సమంతకి సూచించింది. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుతో పాటు సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తూ కించపరిచారని సమంత పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనల అనంతరం కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఆ రెండు యూట్యూబ్ ఛానళ్లు, సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియో లింక్స్‌ని తొలగించాలని ఆదేశాలు వెలువరించింది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.