
మెగాస్టార్ చిరంజీవి అంతులేని ఉత్సాహానికి లోనయ్యాడు దానికి కారణం రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ ల చిత్రం. దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా దర్శక దిగ్గజం గ్రేట్ శంకర్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అని నిన్న ప్రకటన చేయగానే తెలుగు సినీ పరిశ్రమలో నే కాకుండా చాలామందికి ఈ వార్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. గతంలో చిరంజీవి పలు సందర్భాల్లో శంకర్ దర్శకత్వంలో నటించాలని తన కోరికని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడుఆ అవకాశం తన కుమారుడు చరణ్ కి రావడంతో తను చాలా ఎగ్జైట్మెంట్ కి లోనవుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా …. ”క్రాఫ్ట్, విజనరీ, సరిహద్దులను దాటడంలో మార్గదర్శకుడు శంకర్‌తో రాంచరణ్ సినిమా చేస్తుండటం థ్రిల్ కలిగించే విషయం. నీ వరుస సినిమాలు భారత ఖ్యాతిని పెంచే దర్శకులతో చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. గుడ్‌లక్..”అంటూ #RC15 #SVC50 హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు చిరంజీవి




Comments are closed.