The South9
The news is by your side.

సెవెన్ జి బృందావన్ కాలనీ ఫేమ్ సోనీ అగర్వాల్ ప్రధాన పాత్రలో డిటెక్టివ్ సత్యభామ.

post top

సెవెన్ జి బృందావనం కాలనీ ఫేమ్ సోని అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తూ నటిస్తున్న చిత్రం డిటెక్టివ్ సత్యభామ. ఈ చిత్రాన్ని సినిమా ఎంటర్టైన్మెంట్ పతాకంపై పూల మనీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిగా నవనీత్ చారి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గురించి చిత్ర యూనిట్ మాట్లాడుతూ…… ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని , నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు సైకోల గా మారి పోవడాన్ని వారి ప్రవర్తన ఆధారంగా జరుగుతున్న నేర ఘటనల గురించి పరిశోధనాత్మకంగా కథతో సినిమా తీన్నామని అన్నారు. ఈ చిత్ర ప్రధాన పాత్రధారి అయిన సోనీ అగర్వాల్ డిటెక్టివ్ గా నటిస్తున్నారని తెలిపారు. అతి త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న డిటెక్టివ్ సత్యబామ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. చిత్రం ఆడియో త్వరలోనే విడుదల చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.