అమరావతి : ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు నిన్న ఎన్నికల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ప్రతి దగ్గర వైఎస్ఆర్సిపి ఏకపక్ష పోరు సాగించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ప్రారంభమైన నాటి నుంచి తెలుగుదేశం నాయకులు అధికారపక్షం అక్రమాలకు పాల్పడ్డారని, పోలీస్ వ్యవస్థ ని నీరుగార్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కుప్పం మున్సిపల్ ఎన్నికలు తెలుగు దేశం వారికి పెద్ద తలనొప్పిగా మారాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే రాష్ట్రం మొత్తం పై ఆ ప్రభావం ఉంటుందని దానిపై కసరత్తు చేయడం ప్రారంభించారు. అయితే అక్కడ భారీగా దొంగ ఓట్లు పడ్డాయని ఇరుపక్షాలు ఆరోపణలు చేసుకోవడం, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం నాయకులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తమ అభ్యర్థనను హై కోర్టుకు విన్నవించుకున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్లు లెక్కింపు కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి ప్రత్యేక పరిశీలకులుగా ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డిని నియమించాలని ఉత్తర్వుల్లో తెలియజేసింది. ఓటు లెక్కింపు ప్రక్రియ అంతా వీడియో రికార్డు చేయాలని ఎలక్షన్ కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది. మొత్తానికి కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా రానున్నాయేఅని ఇరు పార్టీ పక్షాలు వేచి చూస్తున్నారు.



Comments are closed.