South 9
హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో మోసం… నటి అనూష రెడ్డి పై కేసు
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్లు కాజేసిందని నటి అనూష రెడ్డి పై ఆరోపణలు వెల్లువెత్తాయి. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అనూష రెడ్డితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం ప్రేమగా మారగా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ధర్మేంద్ర వద్ద నుంచి దశలవారీగా రూ.9.35 కోట్లు తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. అనంతరం వివాహం విషయంలో మోసం చేసినట్టు బాధితుడు తెలిపాడు.
ఈ ఘటనపై ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వ్యవహారం నగరంలో చర్చనీయాంశంగా మారింది.


