South 9:
సింగర్ మంగ్లీపై సంచలన ఆరోపణలు
మైక్రోఫైనాన్స్ రంగంలో జరిగిన వందల కోట్ల రూపాయల స్కామ్‌పై కొత్త మలుపు తిరిగింది. గిరిజన జేఏసీ అధ్యక్షుడు సంపత్ నాయక్, ప్రముఖ సింగర్ మంగ్లీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

సంపత్ నాయక్ ఆరోపణల ప్రకారం, ఈ భారీ స్కామ్‌లో మంగ్లీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, ప్రధాన నిందితుడు రమావత్ మధుతో కలిసి కీలక పాత్ర పోషించారని తెలిపారు. అంతేకాక, తన సోదరుడిని కేసు నుంచి తప్పించేందుకు మంగ్లీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
మీడియా సమక్షంలో మంగ్లీ అబద్ధాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని సంపత్ నాయక్ మండిపడ్డారు.
ఇదే స్కామ్‌కు సంబంధించి, కర్ణాటకకు చెందిన ఓ మాజీ మంత్రి మనవడి వద్ద కూడా సుమారు రూ.80 లక్షల వరకు వసూలు చేసినట్టు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ విషయంపై మంగ్లీ లేదా సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.


