The South9
The news is by your side.

తమిళ సూపర్ స్టార్ రజనీ కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించిన కేంద్రం

post top

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కి విశిష్ట పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించినట్లు తెలుస్తోంది, అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో బిజెపి పెద్దలు , కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు దఫాలు రజనీకాంత్ తో రాజకీయ పొత్తుల గురించి చర్చించారు. అయితే అనారోగ్య కారణాలరీత్యా అని చెప్పి రజినీ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి తమిళనాడు బిజెపి లో రజనీకాంత్ అభిమానులు ను ఆకట్టుకొనే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రజినీకి ప్రకటించిన తర్వాత అభిమానులు బిజెపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా. ఏది ఏమైనా దక్షిణాది సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజినీకాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోవడం వారి అభిమానులతో పాటు యావత్ సినీ అభిమానులకు కూడా సంతోషకరమైన వార్త… సూపర్ స్టార్ రజిని కి ‘ద సౌత్ 9 ‘తరపున మా ప్రత్యేక శుభాకాంక్షలు

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.