The South9
The news is by your side.

కెసిఆర్ పై విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల

తెలంగాణ : ‌వైయస్సార్ కుమార్తె వైయస్ షర్మిల తెలంగాణలో రోజు రోజుకి దూకుడు పెంచుతున్నారు. ఏప్రిల్ 9న పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్ షర్మిల కొన్ని విమర్శలు చేశారు.
షర్మిల మాట్లాడుతూ……. కెసిఆర్ జిల్లాలో 20 కరవు మండలాలున్నాయి అని
పటాన్ చెరు ప్రాంతంలో కాలుష్యం కోరలు చాస్తోంది
దళితుల భూములను లాక్కొంటున్నారు అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించడం తో తెలంగాణ రాజకీయాలు ఆసక్తి గా మారే అవకాశం ఉంది. షర్మిల పూర్తి మాటల్లో…. ముఖ్యమంత్రి జిల్లాగా చెప్పుకునే మెదక్ లో 20 కరవు మండలాలు ఉండటం బాధాకరమని అన్నారు. జిల్లాలోని పటాన్ చెరు ప్రాంతంలో కాలుష్యం కోరలు చాస్తోందని విమర్శించారు. మల్లన్నసాగర్ కి భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదని… వారు ఆందోళనబాట పట్టారని అన్నారు. దళితుల భూములను లాక్కొంటున్నారని దుయ్యబట్టారు. మెదక్ జిల్లా వైయస్సార్ అభిమానులతో ఈరోజు ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల అన్నారు. పాటకు ప్రాణం, విప్లవానికి ఊపిరి పోసిన గద్దర్ పుట్టిన గడ్డ మెదక్ అని చెప్పారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం మెదక్ నుంచే ప్రారంభమైందని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా 5.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని వైయస్ భావించారని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు ఇప్పటి పాలకులు ప్రీడిజైన్ చేసి, ఏం చేశారో తెలియదని అన్నారు.

Post midle

Leave A Reply

Your email address will not be published.