The South9
The news is by your side.

దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి చేతుల మీదుగా ‘హ్రీం’ టీజర్ విడుదల

post top

దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి చేతుల మీదుగా ‘హ్రీం’ టీజర్ విడుదల

హారర్-మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘హ్రీం’ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి చేతుల మీదుగా టీజర్ ఆవిష్కరించారు.

పవన్ తాతా, చమింద వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రం, రాజశేఖర్ (శుభోదయం సుబ్బారావు) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ రావూరి దర్శకత్వం వహిస్తున్నారు.

after image

ఈ సందర్భంగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ టీజర్ ఆకట్టుకుందని, నిర్మాత శివ మల్లాల అభిరుచి స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ “హ్రీం” టైటిల్‌లా కాకుండా “క్రీమ్”లా అనిపించేంత నాణ్యత టీజర్‌లో కనిపించిందని, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ చిత్రంలోని మిస్టిక్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని చెప్పారు. హీరోయిన్ చమింద వర్మ ఈ చిత్రం తన టాలీవుడ్ అరంగేట్రానికి ప్రత్యేకమైనదని, హీరో పవన్ తాతా ఇది తన కెరీర్‌లో కీలక చిత్రం అవుతుందని తెలిపారు.

దర్శకుడు రాజేష్ రావూరి మాట్లాడుతూ కొత్త దర్శకుడిగా తనపై నమ్మకం ఉంచిన నిర్మాత శివ మల్లాలకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ 25 ఏళ్ల జర్నలిజం ప్రయాణం తర్వాత నిర్మాతగా మారానని, తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన సినిమా తెరకెక్కించేందుకు మొత్తం బృందం ఎంతో కష్టపడిందన్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.

సాంకేతిక బృందం: దర్శకుడు – రాజేష్ రావూరి | నిర్మాత – శివ మల్లాల | డీవోపీ – అరవింద్ | సంగీతం – మార్కస్ ఎం | ఎడిటింగ్ & డీఐ – వైఎస్ఎస్ శివప్రకాశ్ | వీఎఫ్ఎక్స్ – రాజ్ పవన్ కొమ్మోజు | సౌండ్ డిజైన్ – ప్రేమ్ డేవిడ్ | ఆర్ట్ – సుధీర్ మాచర్ల.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.