The South9
The news is by your side.

జూన్ 24న హైదరాబాద్‌లో ఘనంగా “డిజిటల్ మీడియా అవార్డ్స్ – 2026”

post top

హైదరాబాద్ :

south9:

జూన్ 24న హైదరాబాద్‌లో ఘనంగా “డిజిటల్ మీడియా అవార్డ్స్ – 2026”

హైదరాబాద్: వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ఫిల్మ్ & టీవీ డైరెక్టరీ – డిజిటల్ మీడియా అవార్డ్స్ 2026 ఈ నెల 24వ తేదీ (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు విష్ణు బొప్పన తెలిపారు.

after image

డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్‌తో పాటు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులను గుర్తించి వారికి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

2015 నుంచి వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో బుల్లితెర అవార్డ్స్, వెండితెర అవార్డ్స్, ఫిల్మ్ డైరెక్టరీ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు పేద కళాకారులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

Post midle

ఈ అవార్డుల కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా ద్వారా విష్ణు బొప్పన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.