
వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకొని రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని నెరవేర్చమని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఇకపై కూడా సంక్షేమమే ధ్యేయంగా తన ప్రయాణం ఉంటుందని ప్రతిక్షణం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తానని అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాం. ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందించగలిగాం అని ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని తెలియపరిచారుు వైయస్ జగన్.



Comments are closed.