The South9
The news is by your side.

తమిళనాడు ప్రభుత్వానికి సినీ హీరో సూర్య కోటి విరాళం

post top

చెన్నై ప్రతినిధి : దేశం మొత్తం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఒక రాష్ట్రం అని కాకుండా, దేశంలోని అధిక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదల తో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడులో కేసులు పెరుగుదల ఎక్కువగా ఉన్నందు వలన లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాది సూపర్ స్టార్ సినీ హీరో సూర్య తనవంతుగా ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం అందజేశారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి కోవిడ్ వ్యతిరేక పోరాటంలో తమ వంతు గా ఈ సహాయం చేసినట్లు తెలిపారు. ఈ విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. గతంలో కూడా ‘అగరం ‘అనే ఫౌండేషన్ స్థాపించి సూర్య కుటుంబ సభ్యులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. చాలామంది పేద విద్యార్థులు చదివించడం, అనాధ విద్యార్థులను దత్తత తీసుకోవడం లాంటి ఉన్నతమైన కార్యక్రమాలు ఎన్నో చేసిన నేపథ్యం ఉన్నది సూర్య కుటుంబ సభ్యులకు. ఈ విపత్కర పరిస్థితుల్లో మరల పెద్ద మనసు చేసుకొని తమిళనాడు ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన సందర్భంగా సూర్యా కుటుంబానికి , ‘ద సౌత్ 9’ ప్రత్యేక ధన్యవాదాలు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.