
*ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కాదు సంక్షేమాన్ని వివరించండి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: టీడీపీ నాయకుల్లో ఓటమి భయం కనిపిస్తోంది*
*: వాశిలిలో ఎన్నికల ప్రచారం*
రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో ఏం సంక్షేమాన్ని అందిస్తారో వివరించాలే కానీ అధికారపార్టీ చేసిన సంక్షేమాన్ని విమర్శించడం పనిగా పెట్టుకోవడం సరికాదని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి అన్నారు.
మంగళవారం రాత్రి ఆత్మకూరు మండలం వాశిలి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారని, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.


ఐదేళ్ల పాలనలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ది పథకంలో నడిపేందుకు జగనన్న ప్రకటించిన నవరత్నాల సంక్షేమ పథకాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, ఆర్థికంగా ఎంతో అభివృద్ది సాధించారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాలు గ్రామాలకు అందించిన సంక్షేమం కంటే ఎన్నో రెట్లు అధికంగా సంక్షేమాభివృద్దిని అందచేశారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా నూతన సంక్షేమ పథకాలను రూపొందించి వారిని ఆర్థిక స్థితిమంతులను చేశారన్నారు.

వాశిలి పంచాయతీ పరిధిలో డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా 4643 మంది లబ్దిదారులకు రూ.13.28 కోట్ల నిధులను ఇప్పటి వరకు అందచేయడం జరిగిందని వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వాం ద్వారా గ్రామంలో 12 అభివృద్ది పనుల కోసం రూ.40లక్షలు అందచేశామని అన్నారు. ప్రతి ఒక్కరి స్వంతింటి కలను నిజం చేసేందుకు జగనన్న లే అవుట్ ద్వారా 82 మంది ఇంటి నివేశన స్థలాలు అందచేయడం జరిగిందని అన్నారు. విద్యావ్యవస్థలో చేసిన సంస్కరణల్లో భాగంగా 33 మంది విద్యార్థులకు ట్యాబ్ లు అందచేయడం జరిగిందని వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూజగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ది చెందిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినబాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమం ప్రతి గడపకు చేరిందని, అలాంటి వాలంటీర్లపై టీడీపీ నాయకులు తొలి నుంచి అనేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇటివల వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చుస్తూ టీడీపీ నాయకులు మాట్లాడారని, వాలంటీర్ల పనితీరును చూసిన ఏ ఒక్కరైనా ఆ విధంగా వాలంటీర్లను మాట్లాడితే సహించరని అన్నారు.
టీడీపీ నాయకులకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునాయుడు తాను ప్రవేశపెట్టిన ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల ముందు నిర్భయంగా చెప్పుకోలేకపోతున్నారని, దీనిని బట్టే వారు ఏ విధంగా పాలన అందించారనే ప్రజలు తెలుసుకోవాలన్నారు.
జగనన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలందరికి సంక్షేమాన్ని అందించి ఆ ధైర్యంతోనే రానున్న ఎన్నికల్లో మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటెయ్యండి అంటూ ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా గతంలో మీ ప్రభుత్వ హయాంలో చేసిన మంచిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలే కానీ అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ప్రచారాలు సాగించవద్దని సూచించారు.
ప్రజలందరూ జగనన్న పాలనతో సంతృప్తిగా ఉన్నారని, మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారని, గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలకు వస్తున్న మాకు లభిస్తున్న జనాదరణ చూస్తేనే ఇది స్పష్టమవుతుందని, 175కు 175 స్థానాల్లో తప్పక విజయం సాధిస్తామని పేర్కొన్నారు.



Comments are closed.