The South9
The news is by your side.

మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు!, పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా?: సీఎం జగన్

post top

*మేమంతా సిద్ధం డే1*

 

*తేది:27-03-2024*

*స్థలం: కడప జిల్లా*

 

*మొదటి రోజు జగన్ మేమంతా సిద్ధం’ యాత్రకు పోటెత్తిన జనం.. సంక్షేమాన్ని కొనసాగిస్తానని జగన్ ప్రతిజ్ఞ*

 

*మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు!, పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా?: సీఎం జగన్*

 

*విశాఖ డ్రగ్స్ కేసులో చంద్రబాబు, పురంధేశ్వరీల బంధువులే ఉన్నారు, నేరం చేసేది వాళ్లు.. తోసేది వైసీపీ పైన: సీఎం*

 

*మీ కోసం 130 సార్లు బటన్ నొక్కి రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అందించా, ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే ఎన్నికల్లో కేవలం 2 బటన్లు నొక్కాలని స్టార్ట్ క్యాంపేయినర్లు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి*

Post midle

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ యాత్ర మొదలుపెట్టారు. ప్రొద్దుటూర్‌ టౌన్‌లో జరగబోయే బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ప్రొద్దుటూరులో ఈ రోజు ఒక మహా సముద్రం కనిపిస్తుంది అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. త‌న ఒక్క‌డిపై యుద్ధానికి ప్ర‌తిప‌క్షాల‌న్నీ కలిసి కట్టుగా వస్తున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు. వైయ‌స్ వివేకానంద‌రెడ్డి చిన్నాన్నను చంపారు.. నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారని మండిప‌డ్డారు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.

 

వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో. కానీ, నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా. ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తపించిపోతున్న ఒకరిద్దరు నావాళ్లు భాగం అయ్యారు.

 

ఇంతటి దారుణం చేసి.. నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి?. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం చేసినా.. నేను మాత్రం ప్రజల పక్షం ఉంటా అని గర్వంగా చెబుతున్నా.

నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. అందరూ కలిసి జగన్‌పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాం‍్గరెస్‌ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. కానీ, నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా, దేవుడి దయ ఉన్నాయి. విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

 

– ఐదేళ్ళ పాలనలో మీ జగనన్న మీ కోసం 130 సార్లు బటన్ నొక్కి రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లోకి చేర్చారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే ఎన్నికల్లో కేవలం 2 బటన్లు నొక్కాలని స్టార్ట్ క్యాంపేయినర్లు అందరూ ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఫ్యాన్‌ మీద బటన్‌ నొక్కితే.. గతంలో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండదు. చంద్రబాబును నమ్మడం అంటే.. పథకాలను మనం రద్దు చేసుకోవడమే

 

*సీఎం జ‌గ‌న్ స్పీచ్ హైలేట్స్*

 

లక్షల సింహాల గర్జన… చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండి పోతుంది.

గట్టిగా గర్జించండి.. మేమంతా సిద్ధమేనని!

పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా?

మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు!

మే 13న ఫ్యాన్‌ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా?

వైఎస్సార్‌ జిల్లా నేలమీద… ఈ పొద్దుటూరు గడ్డమీద…నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు

ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్‌సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే.

 

– అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాలు, ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా

కాబట్టే చెబుతున్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది అని.. రాష్ట్రంలో ఎ‍క్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయి!

కాబట్టే ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడం లేదు..

లక్షల సింహాల గర్జన… చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండి పోతుంది.

గట్టిగా గర్జించండి.. మేమంతా సిద్ధమేనని!

పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా?

మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు!

మే 13న ఫ్యాన్‌ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా?

 

– వైఎస్సార్‌ జిల్లా నేలమీద… ఈ పొద్దుటూరు గడ్డమీద…నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు

ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్‌సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే.

అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాలు, ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా

కాబట్టే చెబుతున్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది అని.. రాష్ట్రంలో ఎ‍క్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయి!

కాబట్టే ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడం లేదు..

నా చెల్లెల్ని తెచ్చుకున్నారు

after image

చంద్రబాబుకి శవరాజకీయాలు, కుట్రలు అలవాటు

నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు

ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు

ఛీ.. ఇది పేపరా?

మనల్ని తిట్టేవాళ్లు కూడా ఏం రాస్తారో చూడాలని పొద్దున్నే ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తా

అందులో రాతలు చూసి ఛీ ఇది పేపరా అనుకుంటా

ఈ మధ్య వార్తల్లో చూశా

 

– చంద్రబాబు వదినగారి చుట్టం

తన కంపెనీకి డ్రై ఈస్ట్‌ పేరుతో డ్రగ్స్‌ దిగుమతిచేస్తావుంటే సీబీఐ వాళ్లు రెయిడ్‌ చేశారు

ఈ రెయిడ్‌ జరిగిందని తెలిసిన వెంటనే.. యెల్లో బ్రదర్స్‌ ఉలిక్కి పడ్డారు

దొరికితే తమ బ్రదర్‌ కాదని.. మన బ్రదర్‌ అని నెట్టేసే యత్నం చేశారు

 

– బాబాయ్‌ను అన్యాయంగా చంపేశారు.. వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపి.. అతిహీనంగా.. బహిరంగంగా హంతకుడు తిరుగుతున్నాడు

– ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు.

– ఆ చంపినోడు ఉండాల్సినోడు జైల్లో.. నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా, రాజకీయ లబ్ధి కోసం తపించి పోతున్న ఒకరిద్దరు నా వాళ్లు

– చిన్నాన్నను అన్యాయంగా చంపారు, రాజకీయంగా నాపై నెట్టేసే యత్నం చేస్తున్నారు

– ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారు.. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి?

– ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా

 

– అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు

ఇడుపులపాయ నుంచి ఇఛ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం

ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నాం

రూ.3 వేలు పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు

పెన్షన్‌ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం

 

– ప్రతి ఇంటికి రేషన్‌ రావాలంటే మళ్లీ జగనన్నే రావాలి

పేదల భవిష్యత్‌ బాగుండాలంటే మళ్లీ మీ జగనన్నే రావాలి

మీరే నాకు స్టార్‌ క్యాంపెయినర్లు

ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని చెప్పాలి

గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌ బాగుపడాలన్నా మళ్లీ జగన్‌ను గెలిపించండి

జగనన్న ముఖ్కమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం

నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు పడాలన్నా జగన్ననే ముఖ్యమంత్రి అవ్వాలి

చంద్రముఖి చెడద పోవాలంటే ఫ్యాన్‌ గుర్తుపై ఓటేయాలి

 

*పేదల భవిష్యత్‌ ఈ ఎన్నికలపై ఆధారపడి ఉంది: సీఎం జగన్‌*

 

2014లోనూ ఈ కూటమి మోసపూరిత హామీలిచ్చాయి.

రైతు రుణమాఫీ అన్నాడు.. మోసం చేశాడు

పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?

పేదల ఖాతాల్లో బాబు ఒక్క రూపాయి అయినా వేశారా?

నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?

మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.