The South9
The news is by your side.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల చిన్న ,మధ్య తరగతి పత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.:- ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ జాతీయ సమావేశం ఆందోళన .

post top

అమరావతి:

విజయవాడ 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల చిన్న ,మధ్య తరగతి పత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.:- ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ జాతీయ సమావేశం ఆందోళన .

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.: ఎం.ఎ.షరీఫ్.

జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చిన పరిష్కారానికి ముందుంటాం. బొప్పరాజు వెంకటేశ్వర్లు.

after image

ఘనంగా ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ ఫెడరేషన్ నేషనల్ సెమినార్ మరియు గోల్డెన్ జూబ్లీ ఇయర్ సెలబ్రేషన్స్ .

జాతీయ ప్రతినిధులకు, రాష్ట్ర ప్రతినిధులకు ఘన సత్కారం.

Post midle

విజయవాడ:

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (APJU) ఆహ్వానం మేరకు జూలై 25 శుక్రవారం విజయవాడ లెమన్ ట్రీ ప్రీమియం హోటల్ నందు “ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్” ,న్యూఢిల్లీ. గోల్డెన్ జూబ్లీ వేడుకలు మరియు “ప్రస్తుత మీడియాపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ప్రభావం” అన్న అంశంపై సెమినార్ జరిగింది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు గురీoదర్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ముందు చిన్న, మధ్యతరహా వత్రికల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దేశంలో పత్రిక సంపాదకులు ‘రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా’ పెడుతున్న వివిధ కఠిన తర నిబంధనలు వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫైలింగ్ చేయడంలో ఆలస్యం అయితే 10,000 నుంచి 2 లక్షల వరకు జరిమానా, అది కూడా అతిక్రమిస్తే టైటిల్ రద్దు వంటి నిబంధనలవల్ల పత్రికలు నడపడం కష్టతరంగా మారింది అన్నారు.

ప్రధాన కార్యదర్శి ,అశోక్ కుమార్ నవరతన్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో పత్రిక సంపాదన ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించడంలో ఆల్ ఇండియా స్మాల్ ,మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ ముందంజలో ఉందన్నారు.ప్రెస్ కౌన్సిల్ సభ్యులు సుధీర్ కుమార్ పాండే మాట్లాడుతూ పత్రికల సంపాదకులు ఢిల్లీలోని ఆర్ఎన్ఐ నందు ఏమైనా సమస్యలు ఉన్నయెడల నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.ఏపీ మైనారిటీ అఫైర్స్ అడ్వైజర్, మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఏ. షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పత్రిక సంపాదకులు మరియు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జర్నలిస్టు సంక్షేమ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరియు ఇంటి నిర్మాణాల కోసం కోటమి ప్రభుత్వం లో భాగమైన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోపెట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బోప్ప రాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జర్నలిస్టుల మరియు అధికారులకు ఇళ్ల స్థలాల విషయం ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యగా ఉందన్నారు.కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని వాటిని పరిశీలించిన ప్రభుత్వం కృషి చేయాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ కు తాము ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని ఏ సమస్య వచ్చినా తాము సహకరిస్తామని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను వెంకటవేణు మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తమ పోరాటం నిరంతరాయంగా సాగుతుందన్నారు. సమాచార శాఖ అవలంబిస్తున్న విధానాలపై ఇప్పటికే అనేకమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఉపయోగం లేదన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల యాక్ట్ విషయంలో స్పందించాల్సిన కార్మిక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.అలాగే రాష్ట్రంలోని ప్రింటర్స్ పబ్లిషర్స్ కు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయడంలో కానీ, ఆక్రిడిటేషన్లు మంజూరు చేయడంలో కానీ అనేక నిబంధనలు పెట్టి వారిని ఇబ్బందుల గురిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చిన్న మధ్యతరగతి పత్రికల కు ప్రభుత్వ ప్రకటనల ను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి శేఖర్ బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొమ్మోజు రమేష్ బాబు, కృష్ణ భగవాన్, ద్వారం వేణుగోపాలరెడ్డి, మన పాటి చక్రవర్తి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు వారి సందేశం ఇచ్చారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు అవుతున్నాయని తెలిపారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులకు ప్రతినెల పెన్షన్ ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ముఖ్య అతిథుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా విచ్చేసిన వివిధ రాష్ట్రాల ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (APJU )ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఘనంగా సత్కరించి మెమెంటో బహుకరించినది. అలాగే జిల్లాల నుంచి విచ్చేసిన జర్నలిస్టులను కూడా సత్కరించింది. చివరగా వందేమాతరం, జనగణమన గీతాలాపనతో కార్యక్రమం ముగిసినది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.