The South9
The news is by your side.

అనాధ పిల్లలకి అండగా నిలిచిన సంపూర్ణేష్ బాబు

post top

తెలంగాణ: టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో కూడా హుదూద్ తుఫాను సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష రూపాయల విరాళం అందజేశారు. ఈమధ్య సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని చల్లాపూర్ కి చెందిన సంగోజు నరసింహాచారి పని దొరకక తన కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి, అప్పిచ్చిన వారి నుంచి ఒత్తిడి వల్ల తన భార్య దేవేంద్ర మే 1న ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో పిల్లలు ఇద్దరు తో స్థల మార్పిడి జరిగితే ఏదైనా పని దొరుకుతుందని భావనతో నరసింహాచారి సిద్దిపేట కి మకాం మార్చాడు.                                                                                                  నెలరోజులుగా సిద్దిపేటలో కూడా పని దొరకనందు వలన కుంగిపోయిన నరసింహాచారి తన సొంత ఊరికి వచ్చి భార్య ఉరి వేసుకున్న దూలానికి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో అనాధలైన పిల్లలు గాయత్రీ , లక్ష్మీ ప్రియుల ను సినీ హీరో సంపూర్ణేష్ బాబు పరామర్శించి 25 వేల రూపాయల చెక్కును వారికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కుటుంబానికి అండగా ఉంటామని, వారి ఉన్నత చదువులకు సహాయ పడతామని, తనతో పాటు దర్శకుడు స్టీఫెన్ శంకర్ కూడా తోడ్పాటు అందిస్తారని అన్నారు. ఆ కుటుంబానికి అండగా నిలబడిన సంపూర్ణేష్ బాబు కు మా ధన్యవాదాలు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.