The South9
The news is by your side.

‘సభకు నమస్కారం’ అంటున్న అల్లరి నరేష్

post top

టాలీవుడ్ కథానాయకుల్లో అల్లరి నరేష్ శైలి విభిన్నం. కామెడీ హీరోగా చిత్రాలు చేస్తూనే కథాబలం ఉన్న సినిమాలలో నటిస్తూ విభిన్నంగా ముందుకు వెళ్తున్న హీరో అల్లరి నరేష్. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన మహర్షి సినిమాలో లీడ్ రోల్ పోషించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే నాంది సినిమాతో సోలో హీరోగా సక్సెస్ కొట్టి తనలోని విభిన్న నటుణ్ని మరొకసారి ప్రేక్షకులను చూపించి మెప్పించాడు అల్లరి నరేష్. కొత్త పాత్రలు వైపు ముందుకు సాగుతున్న నరేష్ తో తాజాగా ‘సభకు నమస్కారం’ అనే చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ సంస్థ ప్రకటించింది. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లం పాటి సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అల్లరి నరేష్ నుంచి మరొక డిఫరెంట్ సినిమా అవుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.