The South9
The news is by your side.

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్న ఈటెల?

post top

హైదరాబాద్ ప్రతినిధి:                                                                                                      తెలంగాణ బీసీ నేత ఈటెల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తు ని రేపు ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి మంత్రి పదవి కోల్పోయిన తర్వాత వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలు కలిసి వచ్చిన రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రేపు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన తర్వాత అధికారకంగా బీజేపీ లో చేరబోతున్న ట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు బిజెపిలో చేరుతున్నట్లు ఎక్కడ చెప్పకపోయినా , రేపు తన రాజీనామా తర్వాత మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు, అందులోనే ప్రకటించే అవకాశం ఉంది అనేది సమాచారం. ఇప్పటికే తెరాస పై పలు ప్రశ్నలు సంధించిన ఈటెల రాజేందర్ రేపు ఏమి మాట్లాడ బోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.