తెలంగాణ( సినీ బ్యూరో ) తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నిస్తేజం ఆవరించింది. ఒకపక్క నాయకులు కేసులు తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోపక్క వైసీపీ ని ఎదుర్కొనే బలం ఉందా అనే విషయంలో ప్రజలు తెలుగుదేశం పార్టీని ప్రత్యామ్నాయంగా అనుకుంటున్నారా అన్న సందేహం చాలామందిలో ఉంది. తెలుగుదేశం భవిష్య నాయకుడు ఎవరన్నది వారిలో వారికే జవాబు లేని ప్రశ్న గా మిగిలి ఉన్నది. ఈ నేపథ్యంలో ఎవరు కాదన్నా అవునన్నా తెలుగుదేశం పార్టీ లో జూనియర్ ఎన్టీఆర్ ని ఒక ఆశాకిరణంగా ఎదురు చూస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే పార్టీకి పూర్వవైభవం వస్తుందని గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల అభిప్రాయం. దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ లో విపరీతమైన ఇమేజ్ వున్న సంగతి అందరికీ తెలిసిందే . అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న అనే అనుకోవాలి . ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ఆర్, ఆర్, ఆర్. ఈ చిత్రం తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మంచి పవర్ ఫుల్ రాజకీయ నేపథ్యం ఉన్న కథ తో చేయబోతున్నాడు అనేది ఫిలిం నగర్ వర్గాల సమాచారం. పవర్ ఫుల్ రాజకీయనాయకుడిగా ఈ చిత్రంలో నటించబోతున్నాడు అట . ఇదే నిజమైతే తన రాజకీయ రంగ ప్రవేశానికి సంకేతాలు ఇస్తున్నాడని అనుకోవాలి ?



Comments are closed.