
భారతదేశం గర్వించదగ్గ వ్యాపార దిగ్గజాలు లో ప్రముఖులు రతన్ టాటా. టాటా గ్రూప్ నుంచి అనేక ఉత్పత్తులు తో సామాన్యుడికి దగ్గర సంబంధం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వ్యాపారవేత్తగా నే కాకుండా తన ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న టువంటి ఘనత టాటా గ్రూప్ ది. కరోనా విపత్కర సమయంలో దేశం కోసం.
టాటా ట్రస్ట్ నుంచి 500 కోట్లు అందజేసిన ఘనత కూడా రతన్ టాటా ది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా రతన్ టాటాకి భారతరత్న ఇవ్వాలని ప్రచారం విస్తృతంగా జరుగుతున్న పరిస్థితుల్లో, ఈ ప్రచారాన్ని నిలిపివేయాలని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు రతన్ టాటా. ఒక భారతీయుడిగా భారతదేశ ఉన్నతిని, అభ్యున్నతిని కోరుకుంటానని తెలియజేశారు.




Comments are closed.