
ఆంధ్ర రాష్ట్రంలో ఒకేరోజు 13 లక్షల 72 వేల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయడంపై 2 రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడం జరిగిన సంగతి తెలిసిందే! దీనికి ప్రతి స్పందనగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిరంజీవి కి ధన్యవాదాలు తెలిపడం జరిగింది. ఈ నేపథ్యంలో వై .ఎస్. ఆర్.కాంగ్రెస్ పార్టీ తరుపున చిరంజీవి కి రాజ్యసభ సీటు కేటాయిస్తూరనే వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. గత కొన్ని రోజుల క్రితం చిరంజీవి తన సొంత నిధులతో భారీగా ఆక్సిజన్ సిలిండర్లు ను తన ట్రస్టు ద్వారా సరఫరా చేసిన సందర్భంగా…

మీడియాలో ప్రముఖంగా ప్రచురించడం గాని , ఏ రాజకీయ నాయకుడు దానిని ప్రశంసించడం జరుగలేదనే సంగతి నిర్వివాదాంశం. కొన్ని రోజుల తర్వాత ఆంధ్రప్రభ దినపత్రికలో చిరంజీవి చేసిన సేవ పై ప్రముఖంగా ప్రచురించడం, తదుపరి ఆ పత్రిక అధిపతి తో చిరంజీవి సంభాషించిన ఆడియో వైరల్ అవ్వడం జరిగింది. సేవ చేస్తే కూడా వివక్ష చూపిస్తున్నారని చిరంజీవి ఆయనతో మాట్లాడిన మాటల్లో నిజం లేకపోలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి జగన్ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసించడం తో రాజ్యసభ సీటుపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే జగన్ నిజంగా చిరంజీవిని తన పార్టీ తరఫున రాజ్యసభ సీటు కేటాయిస్తే చిరంజీవి సామాజిక వర్గం ఆనందపడడం ఖాయం. ఈ చర్యతో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు పై కాస్త గండి పడే అవకాశం లేకపోలేదు. మొత్తానికి చిరంజీవి ట్వీట్… రాజ్యసభ సీటు తెచ్చి పెడుతుందో లేదో వేచి చూడాలి!



Comments are closed.