The South9
The news is by your side.

అన్నకు శుభాకాంక్షలు తెలియజేసిన వైయస్ షర్మిల

post top

తెలంగాణ ప్రతినిధి : తెలంగాణ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైయస్ షర్మిల రాఖీ పండుగ సందర్భంగా చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్లో అన్న ముఖ్యమంత్రిగా ఉండగా తనకంటూ సొంత రాజకీయ కుంపటి ఏర్పాటు చేసుకుని తెలంగాణలో పార్టీ స్థాపించి ముందుకు వెళ్తున్నారు వైయస్ షర్మిల. ఈ నేపథ్యంలో లో అన్న తో విభేదించారు అని అందుకే స్వంతంగా పార్టీ పెట్టారని రాజకీయ వర్గాల్లో రకరకాల వ్యాఖ్యల వినిపించాయి . అయితే రాజకీయాలు పక్కన పెడితే వారి మధ్య ఉన్న అనుబంధం గొప్పదని మరోమారు తెలియపరుస్తూ… రక్త సంబంధం యొక్క గొప్పతనాన్ని తెలియపరచలా ట్వీట్ చేశారు వైయస్ షర్మిల. “నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.