ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నెల్లూరు జిల్లా కమిటీ.
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కమిటీ.
కావలిప్రతినిధి :
జర్నలిస్టుల సంక్షేమం కోసం అనునిత్యం అందుబాటులో ఉంటామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గాదంశెట్టి శేఖర్ బాబు.

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (APJU) సభ్యత్వ నమోదు కార్యక్రమం కావలి లో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గాదంశెట్టి శేఖర్ బాబు మాట్లాడుతూ, నిరంతరం జర్నలిస్టుల శ్రేయస్సు కోసం యూనియన్ పాటుపడుతుందని అన్నారు. సభ్యత నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. అలాగే మరి కొన్ని రోజుల్లోనే నెల్లూరు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన పాటి చక్రవర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి గర్రె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, పలువురు జర్నలిస్టులు పాల్గొని నూతనంగా సభ్యత్వం తీసుకున్న జర్నలిస్టులు జె. మార్కస్, గోవిందు, సంజీవరెడ్డి, సుబ్బరాయుడు, అరవింద్, జేమ్స్ జైరాజ్, ఎస్.కే అల్తాఫ్, తదితరులు ఉన్నారు.



Comments are closed.