south9 ప్రతినిధి :

టాలీవుడ్ హీరో ప్రభాస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి స్పష్టం చేశారు ఆయనతో తనకు సంబంధం ఉందంటూ అప్పట్లో ప్రచారం జరిగితే తన పిల్లలపై ఒట్టు వేసి చెప్పానని గుర్తు చేశారు ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నానని వివరించారు తనపై ఈ దుష్ప్రచారం చేసిన వీడియోలు హీరో బాలకృష్ణ బిల్డింగ్ నుంచి సోషల్ మీడియాలో అప్లోడ్ అయినట్టు గతంలో జగన్ ఆరోపించారని ఆమె గుర్తు చేశారు మరి చెల్లి పై ప్రేమ ఉంటే ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం చర్యలు తీసుకున్నారని జగన్ ను షర్మిల నిలదీశారు. తనపై దుష్ప్రచారం జరిగిందని అది బాలకృష్ణ ఇంటి నుంచే జరిగిందని తెలిసిన తర్వాత ఆయన ఏం చేశారని ప్రశ్నించారు అధికారం చేతిలో ఉన్నప్పటికీ బాలకృష్ణ పై విచారణ ఎందుకు జరిపించలేదని షర్మిల అన్నారు చివరకు తన సొంత చెల్లెలిపై దుష్ప్రచారం చేస్తున్న వీడియో కూడా తన ప్రయోజనాల కోసం వాడుకున్నాడు అంటూ జగన్ పై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు



Comments are closed.