The South9
The news is by your side.

వినోద్ ఫౌండేషన్ సేవలకు గౌరవం – మనపాటి చక్రవర్తి కిసేవా పురస్కారం.

post top

వినోద్ ఫౌండేషన్ సేవలకు గౌరవం – మనపాటి చక్రవర్తి సన్మానితులు

జర్నలిస్టుల సమాఖ్య( apju )కార్యక్రమంలో సేవా పురస్కారం అందుకున్న వినోద్ ఫౌండేషన్ ఫౌండర్

విజయవాడ: సామాజిక సేవ రంగంలో నిస్వార్థంగా కొనసాగుతున్న వినోద్ ఫౌండేషన్ చేసిన సేవలను గుర్తిస్తూ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (APJU) ఘనంగా సత్కరించింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో, ఫౌండేషన్ స్థాపకుడు  మనపాటి చక్రవర్తి కి “సామాజిక సేవా గౌరవ సన్మానం” ప్రదానం చేశారు.

 

after image

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసన మండలి చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ ఎం.ఎ. షరీఫ్ గారు మాట్లాడుతూ – “సామాజిక బాధ్యతతో ముందుకెళ్తున్న సంస్థలకు సంఘీభావం ప్రకటించడం, మనం ప్రజాస్వామ్యంలో విశ్వసిస్తున్నట్లే. వినోద్ ఫౌండేషన్ సేవలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి,” అన్నారు.

 

ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాలలో విద్య, వైద్య, నిరుపేదలకు ఆహార పంపిణీ, సైనిక కుటుంబాల పునరావాస సహాయం, మహిళా శక్తీకరణ, యువతలో చైతన్యం నింపే కార్యక్రమాలు ముఖ్యమైనవిగా నిలిచాయి. ఈ సేవా యాత్రలో తనతో పాటు ఉన్న ప్రతి సభ్యుని పేరు ప్రస్తావిస్తూ మనపాటి చక్రవర్తి గారు, “ఇది ఒక్కరి పని కాదు. ఇది మాలోని ప్రతి ఒక్కరిలో ఉన్న మానవతా భావనకు అద్దం పడుతోంది,” అన్నారు.

 

కార్యక్రమంలో ఏపీజే యూనియన్ రాష్ట్ర నాయకులు, ప్రముఖ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు మరియు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. సేవా మార్గంలో వినోద్ ఫౌండేషన్ సాధించిన విజయాలు, అందుకున్న గౌరవాలు తదితరాలను ప్రత్యేకంగా ప్రదర్శించిన ఫొటో గ్యాలరీ ప్రజలను ఆకట్టుకుంది.

 

Post midle

ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సంస్థలకు ప్రోత్సాహం కలిగిస్తాయని, ఈ గౌరవం మరింత బాధ్యతను కలిగించేలా చేస్తుందన్నది ఫౌండేషన్ ఫౌండర్ చక్రవర్తి అన్నారు. .

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.