మీడియా రంగానికి నూతన దిశానిర్దేశం చేసిన APJU( ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్) జాతీయ సెమినార్ విజయవంతం.
ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ జాతీయ సెమినార్
విజయవాడ: విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్‌లో ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ (AISMNF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సెమినార్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పత్రికా ప్రచురణకర్తలు, సంపాదకులు, మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని పత్రికా రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (APJU) రాష్ట్ర కార్యదర్శి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనపాటి చక్రవర్తిని ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు, నేషనల్ ప్రెస్ అకాడమీ సభ్యుడు గురేందర్ సింగ్ ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయి మీడియా సదస్సులో ఆయనకు ఈ గౌరవం లభించడం పట్ల పలువురు జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
సెమినార్‌లో దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా వార్తాపత్రికలు ఎదుర్కొంటున్న సవాళ్లు, డిజిటల్ మీడియా విస్తరణ, ప్రభుత్వ విధానాలు, పత్రికా రంగ భవిష్యత్తు, జర్నలిస్టుల సంక్షేమం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.


ఈ కార్యక్రమంలో ఏపీజేయు రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను వేణు, ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి శేఖర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మనపాటి చక్రవర్తి, రమేష్, విష్ణువర్ధన్, వేణుగోపాల్ రెడ్డి, గర్రె వెంకటేశ్వర్లు, హరినాథ్ రెడ్డితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టు నాయకులు, అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


