The South9
The news is by your side.

ఆంధ్రాలో నో లాక్ డౌన్ కర్ఫ్యూ కొనసాగింపు.

post top

ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల్లో కర్ఫ్యూ గడువు ముగియనుండగా , ఈరోజు వైద్య ఆరోగ్య మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల ఆఖరి వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.                                                                                                                                    ఆంధ్రాలో పెరుగుతున్న కేసులు దృష్ట్యా అందరూ లాక్ డౌన్ పెడతారని అనుకున్నారు. మరోవైపు కేంద్రం కూడా 20% పాజిటివ్ రేటు ఉన్నందున లాక్ డౌన్ ఒకటే మార్గమని సూచించింది. ఎందుకనో ప్రభుత్వం మాత్రం కర్ఫ్యూ కొనసాగింపు వైపే మొగ్గు చూపింది.                                                                                              ఈ సమావేశంలో మరో నాలుగు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగింపు ఇస్తే కొంత సానుకూల ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. గ్రామంలో కేసులు పెరగకుండా ఆశా వర్కర్లు, వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.                                                                                                                  ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ఫ్యూ అమలవుతున్న విధానం ద్వారా పెద్దగా ప్రయోజనం కనిపించుటలేదు. ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిన సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండడం. కొంతమంది మాస్కులు పెట్టుకోవడం అలాగే యువత విచ్చలవిడిగా తిరగడం వలన కేసులు పెరుగుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఉన్నత అధికారులు దీనిపై దృష్టి సారించి కర్ఫ్యూ ని కఠినంగా అమలు పరచాలని ప్రజలు కోరుకుంటున్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.