The South9
The news is by your side.

కరోనా ఔషధం 2-డీజే నేడే విడుదల

post top

ఢిల్లీ : నేడు డి ఆర్ డి ఓ అభివృద్ధి చేసిన కోవిడ్ -19 ఔషధం 2 -డీజీ తొలి బ్యాచ్ విడుదల కానుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్ డివో) కేంద్ర కార్యాలయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ 2 డీజీ పి విడుదల చేయనున్నారు. కరోనా వ్యాధి సోకిన రోగులలో ఒక మోస్తరు లక్షణాలు నుంచి తీవ్రత అధికంగా ఉన్న వారికి చికిత్సలో వాడడానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిచ్చింది. ఇది కరోనా రోగుల్ని తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం తగ్గుతుందని క్లినికల్ ట్రయల్స్ లో తేలిందని రక్షణ శాఖ గత కొన్ని రోజుల క్రితమే వెల్లడించింది. మార్కెట్లోకి ఈ ఔషధం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన వెంటనే కరోనా కట్టడి తగ్గుతుందని అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.